రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం

రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం రేపు (శనివారం) మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు – భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్టంలోని పేదలు – ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు- వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *