మోడీని రాజకీయాల్లో లేకుండా చేస్తా-మమత

ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయాల్లో లేకుండా చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. ఒంటెద్దు పోకడతో వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని రాజకీయల నుండి తరిమేయాల్సిన రోజు వచ్చిందని ఆమె అన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమత నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అయినే ప్రధాన మంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని మమతా బెనర్జీ విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు నానా అగచాట్లు పడుతున్నరని అమె అన్నారు. ప్రధాన మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బెంగాల్ ఫైర్ బ్రాండ్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటానికి విపక్షాలు అన్నీ కలసి రావాల్సిన అవసరం ఉందన్నారు.