ముంబయి టెస్టులో కోహ్లి డబుల్ సెంచరీ

విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రేమికులను మరోసారి ఓలలాడించాడు. ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాడ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కోహ్లీ తన స్టైలిష్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అద్భుతమైన స్టోక్స్ తో అభిమానులను అలరించాడు. కళాత్మమైన ఫుట్ వర్క్ తో అద్భుతమైన పుల్ షాట్స్ తో కోహ్లీ డబుల్ సెంటరీని పూర్తి చేశాడు. దీనితో లంచ్ సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 579 పరుగులు చేసింది. దీనితో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన 179 పరుగుల ఆదిక్యాన్ని సాధించింది. మరో వైపు మరో ఆటగాడు జయంత్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు, కోహ్లికి పోటీగా చెలరేగిన జయంత్ యాదవ్ లంచ్ సమయానికి 92 పరుగులు చేశాడు.