మీ త్యాగం మరువదు ఈ దేశం

2008 నవంబర్ 26 రాత్రి భారతదేశపు వాణిజ్య రాజధాని ముంబాయి రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబాయిలోని ప్రధాన ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిన ఉగ్రమూకలు పదుల సంఖ్యలో ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ముందుగా ఇది గ్యాంగుల మధ్య పోరుగా పోలీసులు భావించిన పోలీసులకు ఇది ఉగ్రదాడని ఆ తరువాత కానీ అర్థం కాలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణాలకు తెగించిన ముంబాయి పోలీసులు ముష్కరులను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు అమరులయ్యారు. వారి ప్రాణత్యాగం వల్లే ప్రాణనష్టం పెరగకూండా ఆగింది.    ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 166 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. చత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీ, ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు భీభత్సాన్ని సృష్టించారు. 26/11 దాడులలో దాదాపు 10మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భారత జవాన్లు మట్టుపెట్టగా ఒకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. విచారణ తరువాత వాడిని ఉరికంబం ఎక్కించారు. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం 15 మంది ముంబై పోలీసులు ఇద్దరు ఎస్ఎస్ జి కమెండోలు వీరమరణం పొందారు.

  • ఆపరేషన్ బ్లాక్ టోర్నడో పేరిట ఆపరేషన్ నిర్వహించిన కమెండోలు
  • ఈ తరహా కమెండో ఆపరేషన్ భారత్ లో ఇదే తొలిసారి
  • తొమ్మిది మండి ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత్ భద్రతా బలగాలు
  • ఒకడిని సజీవంగా పట్టుపడ్డాడు.
  • పది దేశాలకు చెందిన 28 విదేశీయుల మరణం
  • ఇప్పటికీ పాకిస్థాన్ దర్జాగా తిరుగుతున్న సూత్రదారులు
  • దాడుల సూత్రదారలకు నిసిగ్గుగా మద్దతునిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం