మతం మార్చుకున్న యువతి ఆత్మహత్య

ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడు మోసం చేశాడంటూ ఒక యువతి నిండు జీవితాన్ని బలితీసుకుంది. ప్రేమించిన వాడికోసం మతం మార్పుకున్న యువతి చివరకు అతను మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటుండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంతోష్ నగర్ లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం స్వాతి అనే యువతి అక్రం అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత మతం మార్చుకున్న స్వాతి తన పేరును అయేషాగా మార్చుకుంది. అయితే ఇటీవల కాలంలో భార్యా భర్తల మధ్య విబేధాలు ఎక్కువకావడంతో పాటుగా అక్రం మరో యువతితో సన్నిహితంగా ఉంటుండడంతో స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. అక్రం పెడుతున్న వేధింపులకు తాళలేకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వాతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.