గుడివాడ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం లో ఇప్పటికే 1.30 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు తీసుకున్నారయూ అని తెలిపారు. ప్రభుత్వం 14 లక్షల రేషన్ కార్డులు తోలగించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధంలేని ఆరోపణలతో గగ్గోలు పెడుతున్నాఋ అని చంద్రబాబు పై ధ్వజమె త్తారు. చంద్రబాబు కరోనా దెబ్బకు బయపడి అద్దాల మేడలో ఆక్సిజన్ పెట్టుకుని ఉంటున్నారని, అందుకే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబుకి సమాచారం తెలియటం లేదు అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా అధికారం లోకి వచ్చిన తరువాత 1.47 కోట్ల రేషన్ కార్డులపై విచారణ చేయిస్తే చంద్రబాబు ప్రభుత్వం 10 లక్షల కార్డులు అనర్హులుకు ఇచ్చారనే విషయం బయటపడింది అని, చంద్రబాబు నాయుడు అనర్హులు కి ఇచ్చిన 10 లక్షల కార్డులు ను తొలగించడం జరిగింది అని తెలియ చేసారు. కరోనా మహమ్మారి సమయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనస్సు తో గత ప్రభుత్వం లో ఇచ్చిన కార్డులకు కూడా పాత రేషన్ కార్డు పద్దతి లో ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 సాయం కూడా అందించారని, రాష్ట్రంలో మరో 3 లక్షల మంది కొత్తగా బియ్యం కార్డు ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడా సీఎం జగన్మోహన్ గారు ఉచిత రేషన్ సరుకుల తో పాటు రూ. 1000 ఆర్థిక సహయం అందించమని అదేశాలు జారీ చేశారు అని మీడియా సమావేశం లో తెలియచేసారు.