భారత్ సంచలన విజయం

ఇంగ్లాండో తో చెన్నైలో జరుగుతున్న టెస్టులో భారత్ అనూహ్య విజయం సాధించింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఐదు టెస్టుల సిరీస్ ను 4-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. వికెట్ నష్టపోకుండా 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. దీనితో ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయం అనుకున్న సమయంలో రవీంద్ర జడేజా బౌలింగ్ మాయాజాలానికి ఇంగ్లాండ్ దాసోహం అనింది. ఏడు వికెట్లు తీసిన జడేజా ఇంగ్లాండ్ తపనాన్ని శాసించాడు. దీనితో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించింది. ఇది భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం కావడం మరొక విశేషం కాగా,  2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.477 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్  ఎడు వికెట్లకు 759 డిక్లేర్
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ 207 ఆలౌట్
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *