భారత్ కు గట్టి షాకిచ్చిన రష్యా

0
18

రష్యా భారత్ కు గట్టి షాకిచ్చింది. భారత్ కు అన్ని రంగాల్లో మద్దతు ఇస్తున్న రష్యా గతంలో ఎన్నడూ పాకిస్థాన్ తో స్నేహసంబంధాలను కొనసాగించలేదు. ప్రస్తుతం పాకిస్థాన్ కు స్నేహ హస్తం అందించడంతో పాటుగా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా-పాకిస్థాన్ కారిడార్ కు రష్యా మద్దతుపలుకుతోంది.
చైనా-పాక్‌ దేశాల మధ్య చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపీఈసీ) ఏర్పాటు జరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది పాక్‌ లోని గ్వాదర్‌ నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్‌ గుండా చైనాలోని జిన్‌ జియాంగ్‌ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారిడార్‌ గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ నుంచి వెళ్లనుంది. ఇది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని భూభాగం. ఈ విషయంపై భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ తో సమావేశమైన సందర్భంలో ప్రస్తావించారు. మరో వైపు  పాక్‌కు రష్యా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న అలెక్సీ వై దేదోవ్‌ సీపీఈసీకి తాము మద్దతిస్తున్నామని, పాక్‌ ఆర్థిక వ్యవస్థకు ఆ ప్రాజెక్టు చాలా అవసరం అని పేర్కొన్నారు.  సీపీఈసీకు తమ యురేషియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ ప్రాజెక్టుతో సంబంధం కలుపుదామనుకుంటున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత్ ఖంగుతిన్నది. అంతర్జాకీయంగా ఈ పరిణామాన్ని కీలక పరిణామంగా చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న అతి కీలక రాజకీయ పరిణామాల్లో ఇదొకటని అంతర్జాతీయ పండితులు పేర్కొంటున్నారు.
ప్రపంచ దేశాల్లో భారత్ కు నమ్మదగిన మిత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రష్యానేనని గట్టిగా చెప్పవచ్చు. సోవియట్ యూనియన్ పతనం అయిన తరువాత కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో రష్యా భారత్ కు మొదటి నుండి అండగానే ఉంటూ వచ్చింది. పాకిస్థాన్ తో భారత్ కు ఉన్న విభేదాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ కు రష్యా బహిరంగ మద్దతు ప్రకటించింది. భారత్ కు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో రష్యా తన వీటో అధికారాన్ని అనేక సార్లు వాడింది. తన స్వంత వ్యవహారాలకు సంబంధించి ఎన్ని సార్లు వీటో అధికారాన్ని నాటి సోవియట్ యూనియన్ కానీ ఆ తర్వరా రష్యా గానీ ఉపయోగించిందో దాదాపుగా అన్నే సార్లు భారత్ ప్రయోజనాలు కాపాడేందుకు రష్యా తన వీటో అధికారాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉపయోగించింది.  అటువంటి దేశం ఇప్పుడు తన వైఖరిని ఎందుకు మార్చుకుంటున్నది  అన్నది కీలకంగా మారింది.
 
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here