ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ప్రపంచ కమ్యూనిష్ట నాయకుడు ఫిడేల్ క్యాస్ట్రో మరణం ఒక్క క్యూబాకే కాదు ప్రపంచంలోని కమ్యూనిష్టు సానుభూతి పరులందరికీ పెద్ద చేదు వార్త.
- క్యాస్ట్రోకు 90 ఏళ్లు. 50 ఏళ్లు పాటు క్యూబా దేశాన్ని ఫిడేల్ క్యాస్ట్రో పాలించారు. 2008లో తన సోదరుడు రౌల్ క్యాస్ట్రో కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
- క్యాస్ట్రో అసలు పేరు ఫిడేల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్. ఆగస్టు 13,1926లో రైతు కుటుంబంలో జన్మించారు.
- కమ్యూనిస్ట్ భావజాలంతో క్యాస్ట్రో పెరిగాడు. యూనివర్శిటీ ఆఫ్ హవానాలో న్యాయశాస్త్రం అభ్యసించేటప్పుడే క్యాస్ట్రోలో కమ్యూనిస్ట్ భావజాలాలు కనిపించాయి.
- 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలోచేరిన ఫిడేల్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే 1952లో క్యూబా ప్రతినిథుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో పోటీచేశారు. అయితే అదే సమయంలో బాటిస్టా…. మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు. కాస్ట్రో…. బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించారు.
- 1953లో అప్పటి క్యూబా అధ్యక్షుడు బటిస్టాను గద్దె దించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఏడాది పాటు జైలు జీవితం గడిపారు.
- జైలు నుంచి విడుదలైన తర్వాత మెక్సికోకు వెళ్లి అక్కడ తిరుగుబాటు ఉద్యమం నడిపాడు. ఇక్కడే మరో విప్లవ నాయకుడు చేగువేరాతో పరిచయం ఏర్పడింది. 1959లో గెరిల్లా యుద్దం ద్వారా బటిస్టాను గద్దె దింపాడు.
- అనంతరం క్యూబా పాలనా పగ్గాలు క్యాస్ట్రో అందిపుచ్చుకున్నాడు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 1976 వరకు ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో..ఆ తర్వాత క్యూబా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
- అధికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికాతోసహా విదేశీయులతోపాటు.. పలువురు స్వదేశీయుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు… ఈ చర్యలతో అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి.. అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా అవసరాలకోసం క్యాస్ట్రో సోవియట్ యూనియన్‌కు దగ్గరయ్యారు..
- క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశారు…. వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించారు… క్యూబాలో ఏక పార్టీ పాలనతో సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పారు..
- క్యూబా పోరాటంలో ఫిడేల్ కాస్ట్రో పాత్ర అసామాన్యమైంది. శత్రువులు ఓడించారు కానీ మనల్ని నిర్మూలించలేదని ఓడినా ప్రతీసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాడు.. అద్భుతమైన నాయకుడుగా ప్రపంచపు కీర్తి పొందాడు.క్యూబా పోరాటం విజయం అనంతరం అమెరికన్ ఆర్థిక ఆంక్షలు తట్టుకుని నిలబడి ప్రపంచదేశాలకు ఒక ప్రత్యామ్నాయం అవడమే కాకుండా లాటిన్ అమెరికన్ దేశాలకు క్యూబా వేగు చుక్కగా మారింది
- క్యూబాతో పాటు సామ్రాజ్యవాదంతో నలిగిపోతున్న దేశాలకు ఫిడేల్ కాస్ట్రో అండగా నిలిచాడు..
- యూఎస్కుచెందిన గూఢాచార సంస్థ సి.ఐ.ఏ 638 సార్లు ప్రయత్నించింది.. క్యాస్ట్రో కాల్చే చుట్టలో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ప్రయోగించి చంపేందుకు ట్రై చేసింది. మాఫియా తరహాలోకూడా కాస్ట్రోను కాల్చివేయటానికి చూసింది. ఈ కుట్రలనుంచి తప్పించుకున్న కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడ్డారు.
- వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా క్యాస్ట్రో ఎదిగాడు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు సహాయం చేశారు… కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్లకు మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పించింది..
- 1991లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు…. వృద్ధాప్యం మీదపడటంతో తన తమ్ముడు రౌల్ క్యాస్ట్రోకు ఫిడేల్ బాధ్యతలు అప్పగించాడు..
- 2008లో పరిపాలనా బాధ్యతలనుండి ఫిడెల్ కాస్ట్రో తప్పుకున్నాడు.
- ఇప్పటికీ ఆ దేశ హీరో ఎవరంటే క్యాస్ట్రో పేరే చెబుతారు అక్కడిప్రజలు…. నియంత పాలన సంకెళ్లనుంచి దేశాన్ని విడిపించేందుకు క్యాస్ట్రో చేసిన పోరాటం అనేక ఉద్యమాలకు దిక్సూచీలా నిలిచింది.