ప్రధాని భద్రతా విధుల్లో ఉన్న ఎస్.ఐ ఆత్మహత్య

ప్రధాన మంత్రి బందోబస్తు విధుల్లో ఉన్న ఒక ఎస్.ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధాని భద్రతా విధుల్లో ఉన్న ఎస్.ఐ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది.  ప్రధానమంత్రి పర్యటన నేపధ్యంలో భద్రతా విదుల్లో భాగంగా ఎస్.ఐ శ్రీధర్ పి.వి.నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే మీద ఉప్పరపల్లి చౌరస్తా పిల్లర్ నెంబర్ 174 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా ఆయన తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీధర్ 2012 బ్యాచ్ కు చెందిన వారు. ప్రస్తుతం చింతలమునపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ. గా పనిచేస్తున్నారు. గతంలో శ్రీధర్ ఎస్.బి లో కొంతకాలం విధులు నిర్వహించారు. ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు.