పోలీసులు మరింత నైపణ్యాన్ని అలవర్చుకోవాలి:మోడీ

పోలీసు శిక్షణా విధానాల్లో మార్పులు రావాల్సిన అవసం ఉందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్‌  ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో ఇవాళ నిర్వ‌హించిన పోలీసు డీజీలు/ఐజీల స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ ప్ర‌సంగించారు. నేరాల పరిధి విస్తరించిన నేపధ్యంలో ఆధునిక పరిజ్ఞాన్ని పోలీసులు అకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని ఆయన కొనియాడారు.  ముంబై న‌గ‌రంలో ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టించిన రోజ‌నిగుర్తుచేసుకుంటూ  ఈ దాడిని తిప్పికొట్ట‌డంలో పోలీసులు అస‌మాన ధైర్య‌సాహ‌సాలు చూపార‌ని వారి ధైర్యసాహసాల కారణంగా ఎంతో మంది అమాయ ప్రజలు ప్రాణాలు నిల్చాయన్నారు.  దేశవ్యాప్తంగా విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా దేశంలో 33వేల మంది పోలీసులుఅమ‌రుల‌య్యార‌ని కూడా ఆయ‌న గుర్తుచేశారు. పోలీసు శిక్ష‌ణ‌కు సంబంధించి చురుకైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంద‌ని, శిక్ష‌ణ‌లో అదొక భాగం కావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. మాన‌వ మ‌న‌స్త‌త్వం, ప్ర‌వ‌ర్త‌నా మ‌నోవిజ్ఞానంలో నైపుణ్యం శిక్ష‌ణ‌లో కీల‌కాంశాలని ఆయ‌న అన్నారు. నాయ‌క‌త్వ నైపుణ్య స‌ముపార్జ‌న ఎంతో ప్ర‌ధాన‌మ‌ని, పోలీసు సిబ్బందిలోఈ నైపుణ్యాన్ని ప్రోదిచేయాల్సిన బాధ్య‌త సీనియ‌ర్ అధికారుల‌దేన‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *