నియోజకవర్గాల పెంపు లేదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అసెంబ్లీ సీట్లను పెంచుతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు సీట్లను పెంచుతారని ఆశలు పెంచుకున్న నాయకుల ఆశలు గల్లంతయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను జనాభా ప్రాతిపదికన పెంచాలంటూ ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 2026 తరువాత జరిగే జనాభా లెక్కల సేకరణ తరువాతనే సీట్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

  •  తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచాల్సిందిగా రెండు రాష్ర్టాల నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి అందాని
  • . అటార్నీ జనరల్ అభిప్రాయం ప్రకారం 2026వ సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేంత వరకు పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది.
  • రాజ్యాంగంలోని 170 అధికరణానికి సవరణ జరుగనంతవరకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ప్రస్తావన ఉన్నప్పటికీ పెంచడం సాధ్యం కాదని గతంలో హోంమంత్రి స్పష్టం చేశారు.