నానక్ రాం గూడ ఘటనలో 16 మంది మృతి?

హైదరాబాద్ నానక్ రాం గూడలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో 16 మంది మృతి చెందిఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. భవనం కూలిన ప్రాంతం చాలా ఇరుగ్గా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక సిబ్బంది ఇప్పటివరకు ముగ్గురిని వెలికి తీశారు. వీరిలో శివ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఆతని భార్య రేఖ, నాగులు సంవత్సరాలు కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా భవన నిర్మాణం కోసం చత్తీస్ ఘడ్ నుండి వచ్చిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. శిధిలాల కింద నుండి బయటపడ్డ రేఖ అందించిన సమాచారం ప్రకారం మరో 13 నుండి 15 మంది వరకు శిధిలాల కింద ఉండవచ్చని తెలిపింది. వీరంతా విజయనగరం జిల్లా నుండి వచ్చి భవన నిర్మాణ పనుల్లో ఉన్నట్టు ఆమె వివరించింది. శిధిలాల తొలగింపు పనులను అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.