నడిరోడ్డుపై దారుణం

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని బెదిరించి బైక్ తో పాటుగా పర్సు, సెల్ ఫోన్ లను లాక్కొనిపోయిన సంఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. వందలాది వాహనాలు తిరిగే రోడ్డు మీదనే ఎటువంటి జంకు లేకుంటా కత్తులతో బెదిరించి మరీ వాహనాన్ని ఇతర విలువైన వస్తువులను లాక్కుని పోయారు. దొంగలను ప్రతిఘటించేందుకు బాధితుడు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు తతంగాన్నీ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరూ బాధితుడికి అండగా నిలబడలేదు. నిర్మానుష్య ప్రాంతాల్లో దోడిపీలు జరగడం మనం చాలానే చూశాం కానీ వాహనాలతో కిటకిటలాడే ప్రాంతంలో ఒక వ్యక్తిని బెదిరించి వాహనాన్ని లాక్కుపోయిన ఘటన సంచలనం రేపుతోంది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 47లో ఈ ఘటన జరిగింది.