తెలుగు,తమిళ సినీపరిశ్రమల్లో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ హవా నడుస్తోంది. రహుల్ దెబ్బకు ఇతర హీరోయిన్లు కాస్త వెనకపడ్డట్టే కనిపిస్తోంది. 2016 రకుల్ ప్రీత్ సింగ్ కు బాగా కలిసి వచ్చింది.
నాన్నకు ప్రేమతో.. మధ్యలో సరైనోడు విజయాలతో రకుల్ జాతకం మారిపోయింది. ఏడాది చివర్లో రామ్ చరణ్ ధృవ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ప్రస్తుతం సాయిధరంతేజ్ తో విన్నర్.. మహేశ్-మురుగదాస్ సినిమా.. బెల్లంకొండ-బోయపాటి సినిమా.. నాగచైతన్యతో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. కెరీర్ లో అద్భుతమైన స్ట్రాటజీతో కెరీర్ లో ముందుకెళ్తోంది రకుల్. అచ్చం సమంత మాదిరే రకుల్ కూడా చిన్నా పెద్ద హీరోలతో కలిసిపోతుంది. ఓ వైపు రామ్ చరణ్, మహేశ్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు సాయిధరంతేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య సినిమా సెట్స్ లో ఉంది రకుల్. ఈ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ మధ్యే ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసింది రకుల్. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇక తమిళ్ లోనూ రకుల్ హవా నడుస్తోంది. ఈ మధ్యే కార్తితో వినోద్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాకే ఓకే చెప్పింది ఈ బ్యూటీ. హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇలా ఎవరో ఒక్కరు పేరున్న వాళ్లైతే చాలు.. ఓకే చెప్పేస్తోంది రకుల్.