దటీజ్ కేసీఅర్

0
64

దటీజ్ కేసీఆర్ ఏం చేసినా ఆయన స్టైలే వేరు. నచ్చిన వారిని నెత్తిన పెట్టుకోవడం వారికోసం ఏమైనా చేయడం ఈ క్రమంలో ఎటువంటి విమర్శలను కూడా లెక్కచేయకపోవడం ఆయనకే చెల్లింది. సాధారణంగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వారికి విడ్కోలు పలికే కార్యక్రమం మొక్కుబడి కార్యక్రమంగా జరగడం రివాజు. అయితే తెలంగాణ తొలి ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ వీడ్కోలు కార్యక్రమంగా మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పనిచేసే అధికారులపై ముఖ్యమంత్రి చూపించిన ప్రేమ అపారమని ఆయన వ్యవహార శైలే ఇందుకు నిదర్శనమని  అంటున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజీవ్ శర్మ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రంలో పరిపాలన ఇబ్బందులు లేకుండా రాజీవ్ శర్మ పనితీరు చాగా గొప్పదని అన్నారు. ముఖ్యంగా సమగ్ర సర్వే, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వంటి విషయాల్లో రాజీవ్ శర్మ పనితీరు చాలా బాగుందని సీఎం కితాబునిచ్చారు. అపార అనుభవం ఉన్న రాజీవ్ శర్మ సేవలను తమ ప్రభుత్వం వాడుకుంటుందని చెప్తూ ఆయన్ను ముఖ్య సలహాదారుగా సీఎం నియమించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here