త్వరలో బాహుబలి-2 షూటింగ్ పూర్తి

ప్రతిష్టత్మక బాహుమలి చిత్రం షుటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. మిలిగిపోయిన ఒకటి రెండు సీన్లను పూర్తిచేయిన తరువాత డిసెంబర్ 27వ తేదీ తరువాత షూటింగ్ కు ప్యాకప్ చెప్పేయనున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్టప్రొడక్షన్ పనులపై సినిమా యూనిట్ దృష్టిపెట్టనుంది. బాహుబలి మొదటి పార్టుతో సహా షూటింగ్ కు దాదాపు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. సుదీర్ఘంగా సాగిన షూటింగ్ ను అతి త్వరలోనే ముగిస్తున్నట్టు చిత్ర యూనిట్ వివరించింది.
బాహుబలి మొదటి పార్టు సూపర్ హిట్ సాధించడంతో రెండవ పార్టును మరింత కళాత్మకంగా తీర్చిదిద్దే దిశగా చిత్రయూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ పై ఇక చిత్రదర్శకుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. నాలుగు సంవత్సరాల పాటు కేవలం బాహుబలి సినిమా షూటింగ్ కే పరిమితం అయిన హీరో ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన తరువాత ఇతర సినిమాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాను మొదలు పెట్టనున్నారు. బాహుబలి షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు బాహుబలి షూటింగ్ లోనే ఉండిపోయిన ప్రభాస్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాతే మరో సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని చిత్రవర్గాలు చెప్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *