తోడియా సంచలన ప్రకటన

నకిలీ ఎన్ కౌంటర్లో తనను హత్యచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వహింధూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తోగాడియా ఆరోపించారు. దశాబ్దాల నాటి పాత కేసులను తిరగదోడి తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని. తనను నకిలీ ఎన్ కౌంటర్ లో హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని తోగాడియా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకోసం పనిచేస్తున్న డాక్టర్ల బృందాన్ని ఐబీ అధికారులు వేధిస్తున్నారని అన్నారు. ప్రవీణ్ భాయ్ తోగాడియ ఆదివారం ఉదయం నుండి కనిపించకుండా పోయారు. తరువాత అహ్మదాబాద్ లోని ఒక పార్క్ లో అచేతనంగా పడిఉన్న ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. లో బీపీ వల్ల తోగాడిగా పనిపోయినట్టు డాక్టర్లు చెప్తున్నారు.
హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తరువాత తోగాడియా మీడియాతో మాట్లాడారు. తనను అంత చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటుగా గోరక్షణ చట్టం, రైతుల మద్దతుధరపై పోరాడుతున్న తన నోరు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తోగాడిగా విరుచుకుని పడ్డారు. తనను ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ ల ప్రభుత్వాలపై తోగాడియా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
అతివాద వీహెచ్ పీ నేతగా పేరుగాంచిన తోగాడియా ఆరోపణలు ఇప్పుడు ప్రకంపలను రేపుతున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అటు బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయ దూమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.