తాలిబన్లను అంతమెందిస్తాంటున్న ట్రంప్

ఆప్ఘనిస్తాన్ లో నరమేధం సృష్టిస్తున్న తాలిబన్ తీవ్రవాదులను అంతమెందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు సృష్టిస్తున్న మారణహోమాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను చంపుతున్న వారితో ఎటువంటి చర్చలకు తావులేదని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో ట్రంప్ యూఎన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ప్రజలను చంపుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్న తాలిబన్లతో చర్చలకు అవకాశమే లేదన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దళాలను పెంచిన ట్రంప్ ఇదే వైఖరిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాలినబ్లను ఉపేక్షించే అవకాశామే లేదన్నారు. దారుణాలకు తెగబడుతున్నా తాలిబన్లను అంతంచేసే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *