డేటింగ్ లకు దూరం అంటున్న పరిణితి

తన పై వస్తున్న పుకార్లపై హీరోయిన్ పరిణితి చోప్రా మండిపడుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు మనీశ్ శర్మ ప్రేమలో పడినట్టు వస్తున్న వార్తలపై పరిణితి చోప్రా మండిపడ్డారు. ప్రేమలో పడ్డట్టు ఒకసారి పుకార్లు రాగా తాజాగా మనీశ్ శర్మతో తాను విడిపోయినట్టు వార్తలు రావడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని పరిణితి చోప్రా మండిపడ్డారు. అసలు ప్రేమే లేదంటే ఇప్పుడు విడిపోయామంటూ మరో సారి వార్తలు రావడం సూస్తుంటే ఇంత దారుణంగా ఎట్లా ప్రచారం చేస్తారని పరిణితి అంటున్నారు. సినిమాల్లో పుకార్లు మామూలే అయినా ఒక్కోసారి ఈ పుకార్లు పరిమితి దాటుతున్నాయని పరిణితి వాపోయారు. సినిమా ఇండ్రస్టీలో అందరితోనూ తాను స్నేహంగానే ఉంటానని అదికూడా తప్పేనా అని ఆమె ప్రశ్నించారు. తాను డేటింగ్ లాంటి పదాలకు చాలా దూరమని చెప్పారు.