డిపాజిట్లపైనా పరిమితి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో డిపాజిట్ల పై ఇప్పటివరకు ఎటువంటి పరిమితి విధించని అర్బీఐ తాజాగా బ్యాంకుల్లో డిపాజిట్ల పై కూడా పరిమితి విధించింది. డిసెంబర్ 30వ తేదీ లోపల 5వేలకు పైచిలుకు మొత్తంలో జమ చేయడానికి ఒకేసారి అవకాశం ఉంటుంది. ఒక సారికి మినహా ఎక్కువ సార్లు రు.5వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసే అవకాశం లేదు. అయితే నల్లధనం వెల్లడి కోసం తీసుకుని వచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథాకం కింద జమ అయ్యే మొత్తాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

తాజాగా రు.5వేలు లేదా అంతకంటే నగదు ను డిపాజిట్ చేయాలనుకునే వారు ఎందుకు డిపాజిట్ చేస్తున్నారన్న విషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. కేవైసీ పత్రాలు పత్రాలు సక్రమంగా లేని అకౌంట్లలో 50వేలకు మించిన నగదును డిపాజిట్ చేయనివ్వరు. ఆఖరి నిమిషంలో పెద్ద మొత్తంలో నగదు నిల్వలను బ్యాంకుల్లో జమ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ చెప్పడానికే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.