ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం లోని ఇంజనీరింగ్ కాలనీలో టీవీ సీరియల్ లో పనిచేసే ఆర్టిస్టు శాంతి అనుమానాస్పద మృతి చెందింది …
గత నాలుగు రోజుల నుంచి ఆర్టిస్ట్ శాంతి తన గదిలోంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు , పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో అనుమానాస్పద గా ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ….
అయితే ఆర్టిస్టు శాంతి అపార్ట్ మెంట్ లో మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు అపార్టుమెంటు వాసులు తెలిపారు
ఆర్టిస్ట్ శాంతి మృతి చెందిన సంఘటన పై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు …..