జిడికే 11 ఇంక్లైన్ సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ఈ రోజున తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు జిడికే 11 ఇంక్లైన్ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ. ఎస్. చంద్రశేఖర్ మరియు రామగుండం ఏరియా -1 జియం శ్రీ. కె.నారాయణ గారు వారిని కలిసి గత మంగళవారం రోజున మొదటి బదిలీ లో విధులకు వెళ్ళిన సంజీవ్ ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరక పోవటం అనే విషయం గురించి మంత్రి శ్రీ. కొప్పుల ఈశ్వర్ గారికి వివరించటం జరిగింది. రెస్క్యూ బృందాలు కూడా ఆన్వేషణ కొనసాగిస్తున్నారు అని తెలిపారు. సింగరేణి అధికారులు ప్రతి నిమిషం అన్వేషణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు సంజీవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడతూ రెస్క్యూ ఆపరేషన్ క్రాస్ చెక్ కొనసాగుతుందని,జీఎం మరియు ఇతర అధికారులు గని వద్ద నే వుంది గని లోపల రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉంటున్నారు అని తెలిపారు, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. ఏ కొరుకంటి చందర్, డైరెక్టర్ శ్రీ. ఎస్. చంద్రశేఖర్, సేఫ్టీ జీఎం నాగ భూషణ్ రెడ్డి, బల్లల శ్రీనివాస్ ,మేయర్ అనిల్ కుమార్,జీయం శ్రీ.కె. నారాయణ ,టిబిజీకే.ఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, గని ఏజెంట్ ఏ.మనోహర్, టిబిజీకే.ఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్, కాలరి మేనేజర్ ఏ.నెహ్రూ , పర్సనల్ మేనేజర్ ఎస్. రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *