చిరు వ్యాపారి వద్ద రు.17కోట్ల నగదు

కేశవ మొదలియార్… తమిళనాడులోని వేలూరులో ఇతని పేరు తెలియని వారు పెద్దగా ఉండరు. కొత్తగా ఇతన్ని చూసిన వారు ఎవరైనా పూటగడని పేదవాడు అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. స్తానికంగా చిన్న కిరాణా దుకాణం నిర్వహించే కేశవ మొదలియార్ అంచెలంచెలుగా ఎదిగారు. సత్తువాచారి గంగయమ్మ ఆలయం వద్ద ఉన్న ఇతనికి చిన్న దుకాణం ఉంది. ఆ దుకాణం ఆదాయంతోనే ఒకటి తరువాత ఒకటిగా సత్తువాచారి ప్రాంతంలో 70 ఇళ్లకు యజమానిగా మారాడు. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగానా ఇతను ఆదాయపు పన్ను చెల్లించిన దాఖలాలు లేవు. ఇతని వద్ద పేగుపడిందందా లెక్కల్లో చూపని ధనమే. రు.1000, రు.500 నోట్ల రూపంలో భారీగా నగదు, బంగారం నిల్వలు చేసుకున్న ఇతని ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించి నోరు వెళ్లబెట్టారు. చిరు వ్యాపారిగా చెప్పుకునే అతని వద్ద నుండి 17 కోట్ల రూపాయల నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కూడా అతని ఇంట్లో బయటపడినట్టు సమాచారం.