చిత్తూరు,నెల్లూర్లపై కూడా వార్థా ప్రభావం

వార్థా తుపాను తమిళనాడును వణికించగా ఇటు అంధ్రప్రదేశ్  లో కూడా ప్రతాపాన్ని చూపింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. తొలుత తుపాను నెల్లూరు జిల్లాలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భావించినా చివరకు అది చెన్నై సమీపంలో తీరాన్ని దాటడంతో తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కొద్దిగా తగ్గినా తుపాను ధాటికి నెల్లూరు, చిత్తురు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చింది.
తుపాను ధాటికి చిత్తురు జిల్లాలోని పలు చోట్ల అతి భారీ వర్షం నమోదయింది. వర్షంతో పాటుగా ఈదురు గాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. పుణ్యక్షేత్రం తిరుమలలో అనేక చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి శ్రీవారి ఆలయంలోకి నీళ్లు రావడంతో ఫైరింజన్ల సహాయంతో నీళ్లను తోడేశారు. వర్షం, చెట్లు కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమల-చెన్నై మార్గంలో రాకపోకలు నిల్చిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా చోట్ల వర్షాలు పడుతుందడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ గాలులు ఆగిపోయినా వర్షం పడుతున్నందు వల్ల అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుకా ఖాళీ చేయిస్తున్నారు. గట్లు బలహీనంగా ఉన్న చెరువులను గుర్తించే పనిలో పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా ఆహారం, ఇతర నిత్యావరస వస్తువులను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసిపెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *