కూలిన కమ్యూనిస్టు శిఖరం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిష్టులకు ఆరాధ్యదైవనం, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో(90) శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో ఆయన జన్మించారు. క్యూబా అధ్యక్షునిగా విశిష్ట సేవలందించిన ఆయన 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా ఉన్నారు.  తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేసిన ఆయన మరణంతో కమ్యూనిస్టు శిఖరం కూలిపోయినట్టుగానే ఆయన అభిమానులు భావిస్తున్నారు.  గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు క్యూబా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.సాయుధ విప్లవం ద్వారా క్యూబాలో అధికారం చేపట్టిన ఫెడల్‌ క్యాస్ట్రో సామ్యావాద పంథాలో దేశాన్ని అభివృద్ధి చేశారు. అదేక్రమంలో అమెరికా సామ్రాజ్యవాదానికి సవాలుగా నిలిచారు. ఫెడల్‌ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కుగదీసింది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పనిచేసిన అత్యంత ప్రతిభాశీలుర్రో క్యాస్ట్రో ఒకరు.  ఆయనను భౌతికంగా మట్టుపెట్టేందుకు, పదవి దింపడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలున్నాయి.