కూటికిలేని గిరిజనల పేరిట లక్షల డిపాజిట్లు

వందరూపాయల నోటును చాలా అరుదుగా చూసే గిరిజనులు వాళ్లు. వంద రూపాయలు సంపాదించడం కోసం రోజుల తరబడి కాయకష్టం చేసే వారి పేరుమీద ఇప్పుడు లక్షల రూపాయలు జమ అయిపోతున్నాయి. తమ పేరు మీద ఇన్ని లక్షల రూపాయలు ఉన్నట్టు వారికి తెలీదు. నల్ల ధనాన్ని కట్టడి చేయడం కోసం దేశంలో రు.1000, రు.500 నోట్లను రద్దు చేయడంతో నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసం బడాబాబులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఐటి చట్టంలోని మినహాయింపులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రల గిరిజనుల కోసం కల్పించిన సౌకర్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ పెద్ద ఎత్తున తమ నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం అమాయక గిరిజనులను పావులుగా వాడుకుంటున్నారు.

  • ఐటి చట్టం ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్,త్రిపుర, నాగాల్యాండ్,మిజోరంలోని గిరిజనలకు ఐటి పన్ను నుండి పూర్తి మినహాయింపు ఉంది.
  • గిరిజనులకు కల్పించిన సౌకర్యం కొందరు పెద్దలకు వరంగా మారింది
  • గిరిజనుల పేరిట డిపాజిట్లు చేస్తున్న పెద్దలు
  • పెద్ద ఎత్తున ఈశాన్య రాష్ట్రాలకు తరలుతున్న నల్ల డబ్బు
  • అప్రమత్తమైన అధికారులు
  • ఒక ఎంపి అల్లుడి అరెస్ట్