కానరాని రు.500 కొత్తనోటు

0
54

హైదరాబాద్ నగర వాసులకు నగదు కష్టాలు తప్పడం లేదు. ఒకటో తారీఖు సమీపిస్తున్నా ఇప్పటికీ ఏటీఎంలలో అధిక శాతం పనిచేయడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్లను అంగీకరిస్తున్న బ్యాంకులు విడ్రాలకు మాత్రం బ్యాంకుల్లో డబ్బులు లేవని చేప్తున్నారు. దీనితో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో విడ్రా చేసుకున్నా కేవలం రు.రెండువేల రూపాయల నోట్లను ఇస్తుండడంతో వాటికి చిల్లర రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రు. రెండువేల నోటుకు ఎక్కడా చిల్లర దొరకడం లేదని నోటు మార్చుకోవడం చాలా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. కొత్త ఐదువందల రూపాయల నోట్లు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. రు.500కి బాగా డిమాండ్ ఉన్నప్పటికీ వాటి సరఫరా మాత్రం అరకొరగానే ఉంటోంది. ఐదు వందల రూపాయల నోట్లు పెద్ద ఎత్తున వచ్చినట్టు ప్రచారం జరిగినా వాస్తవానికి ఐదు వందల నోట్లు ఎక్కడా కనిపించడం లేదు. అక్కడక్కడా ఐదు వందల రూపాయల నోట్లు కనిపించానా డిమాండ్ కు సరఫరాకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు.
నగదు కొరత తీవ్రత నుంచి బ్యాంకు మేనేజర్లకు కొంత ఉపశమనం లభించింది. నాలుగు రోజులుగా ఆయా ప్రాంతాల్లోని రిజర్వ్‌బ్యాంక్ సెంట్రల్ క్యాష్ చెస్ట్‌లలో పడిగాపులు పడ్డా కొసరు నగదు మాత్రమే లభించడంతో కొందరు బ్యాంకు మేనేజర్లు కార్యాలయాలకు వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. మంగళవారం చాలా బ్యాంకులకు రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వడంతో కొంత మేరకు నగదు చెల్లింపులు సజావుగా జరిగాయి.

  • బ్యాంకులకు  పంపిణీ చేసే నోట్లలో 96 శాతం రూ.2వేల నోట్లు ఉండటం వల్ల చిల్లర సమస్య  తలెత్తతుతోంది.
  • రు.500 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నా చూడ్డానికి కూడా ఈ నోటు ఎక్కడా కనిపించడం లేదు.
  • తెలంగాణకు తాజాగా రూ.27 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు ఆర్బీఐ ముంబై కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఒక్క నోటు కూడా బ్యాంకులకు చేరకపోవడం చర్చనీయాంశంది.
  • రు.500 ముద్రణలో కొన్ని లోపాలు ఉన్నందున వాపసు పంపినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నోటును చూసేందుకు మరిన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here