ఐశ్వర్య ఆత్మహత్య అంటూ పుకార్లు

సామాజిక మాధ్యమాల్లో పుట్టే పుకార్లకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా వార్తలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ అత్మహత్య చేసుకుందంటూ వచ్చిన వార్తలు హల్ చల్ చేశాయి. కుటుంబ కలహాల కారణంగా ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని అయితే ఈ వార్త ను బయటికి రాకుండా తొక్కి  పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వార్త షికారు చేసింది. దీనితో ఆమె అభిమానులు తీవ్రంగా కలత చెందారు. యే దిల్ హై ముష్కిల్ చిత్ర ప్రచారంలో పాల్గొంటున్న ఐశ్వర్య ఇందులో హీరో రణ్ బీర్ కపూర్ తో సన్నిహితంగా ఉందని దీనితో బచ్చన్ కుటుంబం ఐశ్వర్యపై విరుచుకు పడిందని దీనితో మనస్థాపం చెందిన ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిందనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇవి కేవలం పుకార్ల మాత్రమేనని వార్తా పత్రికలు స్పష్టం చేయడంతో ఈ వార్తలకు తెరపడింది.