ఏపీలోని నగరాల్లో వైద్య సదుపాయాల కోసం ఓలా సేవలను అనుమతించాలని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వినతి చేసారు. దీనిని సానుకూలంగ ప్రభుత్వం పరిశీలించినట్లు తెలియ చేసారు
విశాఖలో ఫైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసేందుకు అనుమతి…
కోవిడ్ 19తో పాటు డయాలసిస్, హార్ట్, కాన్సర్ వంటి రోగులకు ఓలా సేవలకు అనుమతి ఇస్తూ, ఈ సౌకర్యము కేవలం మెడికల్ అత్యవసర అవసరాలకు మాత్రమే వర్తిస్తుందని తెలియ చేసారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
భౌతిక దూరం పాటించడానికి డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికి మాత్రమే అనుమతి. శానిటైజర్, మాస్క్ వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని తెలియచేసారు.