ఆసిస్ తో హాకీ సిరిస్ డ్రా

0
32

అస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల హాకీ సిరిస్ ను భారత్ డ్రా చేసుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను మొదటి మ్యాచ్ లో ఓడించిన భారత్ రెండవ మ్యాచ్ లో మాత్రం ఓటిమి పాలైంది.   రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌పై 4-3 తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరుఫున అక్షదీప్‌ ఒక గోల్‌ చేయగా… రఘునాథ్‌ రెండు గోల్స్‌ సాధించాడు. కంగారుల తరుఫున ట్రెంట్‌ మిట్టోన్‌, జాక్‌ వెట్టోన్‌ ఒక్కో గోల్‌ సాధించగా… హైవర్డ్‌ రెండు గోల్స్‌ చేశాడు.  భారత్ ఈ మ్యాచ్ లో గెలవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిడి కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ భారత్ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here