ఆశీర్వదించండి… ఆదర్శంగా తీర్చిదిద్దుతా…

0
76

పార్టీ, ప్రజలు అవకాశం కల్పిస్తే “భాన్స్ వాడ” ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ నాయకురాలు, “బేటీ బజావో-బీటీ పడావో” కన్వీనర్ గీతామూర్తి అన్నారు. భాన్స్ వాడ నుండి పోటీ చేసేందుకు పార్టీలో ధరఖాస్తు చేసుకున్నానని, పార్టీ టికెట్ లభిస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని ఆమె తెలంగాణహెడ్ లైన్స్.ఇన్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు. 15 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న గీతా మూర్తి సామాజిక, ప్రజా సమస్యలపై అనుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారికత కు సంబంధించిన అంశాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడంతో పాటుగా దీనిపై జరిగిన అనేక చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆడపిల్లలపై మన సమాజంలో నేటికీ కొనసాగుతున్న వివక్ష, చిన్న చూపులను దూరం చేసేందుకు ప్రజల్లో అవగాహానా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటుగా బాలికలు చదువుకోవడం ఎంత అవసరమనే విషయంపై అవగాహానా కార్యక్రమాలను కార్యక్రమాలను ఆమె చేపడుతున్నారు.
రాజకీయాలు కేవలం కొన్ని వర్గాలపై పరిమితం కాదని సామాజిక అవగాహన ఉండి చదువుకున్న మహిళలు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పే గీతామూర్తి ప్రజా జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజాసేవ చేయడానికి కేవలం పదవులే అవసరం లేదని నిరూపించిన ఆమె పలు ప్రజా సమస్యలను పరిష్కరించారు. జహీరాబాద్ ప్రజలు రైల్వే గేటు లేకపడుతున్న ఇబ్బందులను తొలగించడం, అంగన్ వాడీల్లో సమస్యలను పరిష్కరింరచడం లాంటివి ఇందుకు ఉదాహారణలుగా నిలుస్తుాయి. ప్రజలు అధికారిక పదవిని కల్పిస్తే మరిన్ని ప్రజా కార్యాక్రమాలను నిర్వహించడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని మోడీ సర్కారు మహిళను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంతో పాటుగా వారు వాళ్ల కాళ్లపై వారు నిబడేందుకు కృషిచేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ అవి తమ స్వంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోదని గీతామూర్తి మండిపడ్డారు. తన స్వంత లాభం కోసం తెలంగాణ ప్రజలకు లాభం కలిగంచే కేంద్ర పథకాలను ప్రజలకు టీఆర్ఎస్ దూరం చేస్తోందని ఆమె ఆరోపించారు. పేద ప్రజలకు లబ్ది చేకూర్చే కేంద్ర ప్రభుత్వ భీమా పథకంలో తెలంగాణను ఎందుకు చేర్చడంలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా చెప్పలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధిస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణ కోసం పనిచేసినవారిని పక్కన పెట్టి అవకాశవాదులను అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ అమలుకాలేదని దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ నుండీ పీజీ వరకు ఉచిత విద్య ఇంకా అనేక పథకాలు కేవలం హామీలకే పరిమితం అయ్యాయన్నారు. ఇతర పార్టీల పొత్తుతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని, మహా కూటమి ఓ విఫల కూటమి అవుతుందని ఆమె జోస్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా భాన్స్ వాడ నియోజకవర్గానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒరబెట్టింది ఏమీ లేదని బీజేపీ నాయకురాలు గీతా మూర్తి మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా స్థానిక రైతుల సమస్యలను తీర్చడంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. తనకు అనుకూలంగా ఉన్న కొద్ది మంచి నాయకులకు లబ్ది చేకూర్చడం మినహా నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయన్నారు. స్థానికంగా ఇసుక మాఫియాతో కుమ్మక్కయి దోచుకోవడంలో ఉన్న శ్రద్ద పోచారంకు నియోజకవర్గ సమస్యలు తీర్చడంలో లేదన్నారు.

Wanna Share it with loved ones?