ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. తిరుమలలో ఉన్న ఆయన అక్కడి నుండే ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేంద్రం పై ఒత్తిడి తీసుకునిరావాలని దీనికోసం అన్నిరకాలపోరాటులు చేయాలని అన్నారు. న్యాయం మన పక్షాన ఉందని ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం చేస్తున్న పోరాటం నుండి మడమ తిప్పే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగగిన అన్యాయం పట్ల ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. బీజేపీ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని చంద్రబాబు పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి అందరి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని గురించి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోందని ఇతర పార్టీలు లాలూచీ రాజకీయాలు పాల్పడుతున్నాయని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒక పక్క అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న లాలూచీ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు పర్యటనకు ముందు తిరుమలలో తుపాకీ కలకలం.
andhra pradesh, andhra pradesh chief minister, chandra babu naidu, chandra babu, chandrababu naidu,andhra pradesh people, ysr cp, ysr congress.