ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తోంది – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

0
233

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ధ్వజం ఎత్తారు .
చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ గారు ? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు, అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసారు అని, మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు అని, కరోనా ని ఎలా నివారించాలి అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డి ని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ట్విట్టర్ లో దాడి చేసారు.
అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికల ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలి? అని ప్రశ్నించారు. జగన్ గారి అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా భారిన పడుతున్నారు
అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు,ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకింది అని, డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చింది అని ట్విట్టర్ చేసారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here