రిటైర్మెంట్ పై యూవీ మనసులోని మాట

ఇంగ్లాండ్ లో 2019లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ లో ఆడాలని అనుకుంటున్నానని దీనికోసం గాను ఐపీఎల్ తనకు ఉపయోగపడుతుందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు యువరాజ్ స్పందించారు. 2019 ప్రపంచ కప్ వరకు రిటైర్మెంట్ ఆలోచన తనకు లేదని యువరాజ్ సింగ్ స్పష్టంగా చెప్పాడు. జూన్ 2017లో భారత్ తరపున చివరి వన్డేను ఆడిన యువరాజ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగలనన్ను ధీమా వ్యక్తం చేశాడు. ముందుగా టి-20 జట్టులో స్థానం సంపాదించుకున్న తరువాత వన్డే జట్టులో ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు.
దక్షిణ ఆఫ్రికా పర్యటనలో భారత జట్టు ప్రదర్శన పట్ల యువి సంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ లలో పోరాడినా ఫలితం లేకుండా పోయిందని వన్డే సిరీస్ తో పాటాగు టి-20 సిరీస్ కూడా కైవసం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. కెప్టేన్ గా బాధ్యతలు నిర్వహిస్తునే ఇటు బ్యాట్ తో కోహ్లి అద్భతంగా రాణిస్తున్నాడని అన్నాడు.