హీరోయిన్ కు యువహీరో వేధింపులు

0
62

ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన యువ హీరో ఆగాడాలను భరించలేని ఓ హీరోయిన్ అతని వ్యవహారాన్ని గురించి సినీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. సినీ వర్గాల కథనం ప్రకారం. సినీ పరిశ్రమల బాగా పేరున్న ఒక కుటుంబానికి చెందిన యువహీరో తన సహచర హీరోయిన్ ను తీవ్రంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆమెను నానా రకాలుగా హింసలు పెడుతున్నట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఓ చిత్రంలో నటించిన యువ హీరో తనతో పాటుగా చిత్రంలో నటించిన హీరోయిన్ ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. తనతో పాటుగా తన గదికి రావాలంటూ ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తోంది. అతని ఆగడాలు భరించలేక రెండు,మూడు సార్లు అతని చెప్పినట్టు చేసినప్పటికీ ఇంకా సంతృప్తి చెందని సదరు హీరోగారు ఆ అమ్మాయినీ ఇంకా ఇబ్బందులు పెట్టడంతో విషయాన్ని చిత్ర దర్శకుడి దృష్టికి తీసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు సదరు హీరోతో మాట్లాడేందుకు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పులేదు సరికతా తనను కాదంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎట్లా ఉంటావో చూస్తానంటూ హీరోయిన్ తో పాటుగా దర్శకుడిని కూడా బెదిరించినట్టు సమాచారం.
హీరోయిన్ కు తరచూ వీడియో కాల్స్ చేస్తూ కూడా ఆమెను ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తోంది. దీనితో దీనితో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమానికి దూరం అవ్వాలని సదరు హీరోయిన్ ప్రయత్నించినట్టు సమాచారం. అయితే దర్శకుడు ఆమెను బతిమిలాడి తీసుకుని వచ్చాడని తెలుస్తోంది. హీరోగారి చేస్టలను గురించి సినీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి కూడా హీరోయిన్ సిద్దపడడంతో కొంత మంది మద్యవర్థులు రంగంలోకి దిగి వ్యవహారం మరీ శృతిమించకుండా చేసినట్టు సినీ పరిశ్రమలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువహీరో చేస్తున్న ఆగడాలపై మాత్రం సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబ పేరును అడ్డుపెట్టుకుని కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్న సంగతి మరోసారి బహిర్గతం అయింది.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here