అయోధ్యలో పర్యటిస్తే తప్పేంటి:యోగి

అయోధ్యలో దీపావళి పండుగను జరుపుకోడంలో తప్పేముందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. రెండు రోజుల అయోధ్య పర్యటనకు వచ్చిన యోగి అక్కడి దేవాలయాను దర్శించుకున్నారు. సరయు నది ఒడ్డున జరిగిన దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అయోధ్య పర్యటనను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దీన్ని కూడా రాజకీయం చేయడం దారణమన్నారు. తన వ్యక్తిగత విశ్వాసం మేరకు అయోధ్యలో పర్యటించానని దాన్ని కూడా తప్పు పట్టే అధికార విపక్షాలకు ఎవరిచ్చారని యోగి ప్రశ్నించారు.
ప్రపంచం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు తరలివస్తుంటారని వారికి తగినవిధంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పై ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలను తెలుసుకునే క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రయటనలు చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వాలు అయోధ్యను పూర్తిగా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయోధ్యను మర్చిపోయి సౌకర్యాలను పట్టించోని వారు తనను విమర్శించడం హాస్యస్పదంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *