యడ్యూరప్ప తో రాజీనామా-బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం

0
86
యడ్యూరప్ప రాజీనామా
karnataka bjp, Yeddyurappa

ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో నంబర్ గేమ్ కు తాత్కాలికంగా తెరపడినట్టయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాసతీర్మానం పై ప్రసంగించిన యర్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగాన్ని పూర్తిచేసిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేకుండా పోయింది. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ సర్కారు ఏర్పడనుంది. ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఆనందంతో అసెంబ్లీ లాబీల్లోనే నృత్యాలు చేశారు.
కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రకటించిన జేడీఎస్ నేత కుమారస్వామి ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం లాంఛనమే. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి మూడునాళ్ల ముచ్చగానే ముగిసిపోవడంతో కుమార స్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విశ్వాస తీర్మనంలో నెగ్గేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 222 స్థానాలు ఎన్నికలు జరగ్గా అందులో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జీడీఎస్ 38 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఏపార్టీకీ రాకపోవడంతో కాంగ్రెస్ తాను జేడీఎస్ కు బేషరతుగా మత్తుతు ఇస్తున్నట్టు ప్రకటించిది. అయితే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం దానిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టు గడపతొక్కడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, సభలో మెజార్టీని వెంటనే నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం, ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడం అన్నీ చకచక జరిగిపోయాయి.
ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పాటుగా పార్టీకి చెడ్డపేరు వస్తుండడంతో వెంటనే మేల్కొన్న ఆ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించాలని నిర్ణయించుకున్నారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని ఇందుకోసం గానీ భారీ మొత్తంలో డబ్బులు చేతులుమారుతున్నాయనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. వీటికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో గాలి జనార్థన్ రెడ్డి చేసినట్టుగా చేప్తున్న ఆడియో తీవ్ర సంచలనంగా మారింది. 100 నుండి 150 కోట్ల రూపాయలను సైతం ఇచ్చేందుకు సిద్ధం అయినట్టుగా ఆడియోలో ఉండడంతో పాటుగా సాక్షాత్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాలతోనే మాట్లాడుతున్నట్టు అందులో ఉండడంతో కలకలం రేపింది.
ఇటు ఏకంగా యడ్యూరప్ప తమను ప్రలోభాలకు గురిచేస్తురంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోపించడంతో పాటుగా దానికి సంబందించిన ఆడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అటు పార్టీ కీలకనేతలు మురళీధర రావుతో పాటుగా ఇతర నేతలు విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రంగా ప్రచారం జరగడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేకన్నా విపక్షంలో ఉండడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో సంవత్సర కాలమే మిగిలిఉండడంతో దేశవ్యాప్తంగా పేరు పోగొట్టుకోవడం కన్నా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిదనే నిర్ణయానికి ఆ పార్టీ పెద్దలు వచ్చినట్టు కనిపిస్తోంది. బేరసారాలు చేయడం వల్ల పార్టీ పేరు పూర్తిగా బ్రష్టుపట్టిపోవడం కన్నా ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Bookanakere Siddalingappa Yeddyurappa, Chief Minister of Karnataka. BJP state president for Karnataka, member of Lok Sabha,Shimoga constituency, majority support. Karnataka Legislative Assembly,bjp, amit shah , narendra modi, bjp.

యడ్యూరప్ప రాజీనామా


రాజకీయ రంగు పులుపుకున్న రమణ దీక్షితులు వ్యవహారం
B._S._Yeddyurappa

Wanna Share it with loved ones?