లా ఆఫ్ అట్రాక్షన్…

BY: Anita Yelishetty
స్టోన్ ఏజ్ లో మనుషులకు బట్టలు లేవు, లింగ సమానత్వం ఉంది. చలి, ఎండల నుంచి రక్షంచుకునేందుకు బట్టలు కనుగొనడం, ఆ తరువాత స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షన్స్ పెరగడం జరిగింది. పారిశ్రామిక విప్లవానంతర పతిస్థితుల్లో మహిళను వస్తువుగా చూడడం మొదలైంది. మహిళ ఎప్పుడైతే వస్తువైందో పురుషునిలో అభద్రత పెరిగి జెండర్ బైయస్ పెరిగిపోయింది.ఇక్కడ అర్థమయ్యేదొక్కటే… ఒంటి మీద దుస్తులు లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ లేదని, ఏదో మొక్కుబడిగా కోరిక తీర్చుకోవడం మాత్రమే ఉండేది(టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగినప్పుడు వచ్చే ఫీలింగ్). లేదు సెక్స్ ఓ రెండు హృదయాల, సోల్స్, ఫీలింగ్స్…(భావుకత్వంలోకి వెళితే బోలెడు చెప్పొచ్చు) ల కలయిక అంటే మాత్రం సంసిద్ధత తెలిపేందుకు చాలా సమయమే పడుతుంది…అంటే పైన చెప్పుకున్నవన్నీ ఏకం అయితే అది బాండింగ్ అవుతుంది. ఇవేవీ లేకుండా ఏకమైతే అది కేవలం అర్జ్ తీర్చుకోవడం అవుతుంది, ఇక్కడ బాండింగ్ కు స్థానమే లేదు…మరి బాండింగ్ లేకుండా కమిట్ అయి అన్యాయం జరిగిపోతోందనడంలో అర్థమే లేదు. ఏదైనా గుప్పిటలో దాచినంత వరకే అద్భుతం…తెరిచాక అసహ్యమే మరి.
ఆలోచన లేకుండా చేతులు కాల్చుకున్న ప్రతి మహిళ చెప్పే మాట ఈ ఫీల్డ్ లో (వారి వారి రంగాల్లో) మగవాడి కోర్కెలు తీరిస్తేనే మనుగడ ఉంటుంది లేదా అవకాశాలు రావని… సరే అదెంత నిజమైనా విజ్ఞత గలవారు పక్కకు తప్పుకొని వేరే ప్రయత్నాలు చేసుకోవచ్చు కద, దర్జాగా బతికేందుకు మార్గాలే లేవా.??!
అలా కాకుండా మనమూ ఓ రాయి వేసి చూద్దామనే ధోరణిలో పడి వ్యవస్థలను భ్రష్టుపట్టించే ప్రయత్నం మనం మాత్రం చేయడం లేదా? ఇలా చేశాక చెడిపోయిన వ్యవస్థను ప్రశ్నించే హక్కు గాని, పలానా రంగం పాడైపోయిందని నిందించే అవకాశం గాని ఆ వ్యక్తికి ఏ రకంగా ఉంటుంది..?
ఆ అమ్మాయి పడుతున్న వేదన అర్థమవుతున్నా, స్త్రీత్వాన్ని, సాటి మహిళలను బయటపెడుతున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. సినీ రంగం లో స్థానికులకు అవకాశాలు లేవన్నవి చేదు నిజం. కాని టాలెంట్ లేకుండా కేవలం దర్శక, నిర్మాతల కోరికలు తీరిస్తేనే టాప్ స్టార్లవుతారనే మాట అవాస్తవం. ఇదే నిజమైతే బాలివుడ్ లో దక్షిణాది తారలు ఓ వెలుగు వెలిగారు అదంతా ఓవర్ నైటే సాధ్యమయిందా.? దిగజారి ప్రవర్తించారా.?
ఏదేమైనా
I Support You…
సరే ఇదంతా ఒకెత్తైతే…ప్రతి ఫీల్డ్ లో వివాహేతర శారీరక సంబంధాలు ఉండటం సాధారణమే అన్నప్పుడు ఈ పుణ్యభూమి మీద వీటన్నిటికీ ఇండైరెక్ట్ ఆక్సెప్టెన్స్ ఇస్తూ కేవలం పొట్టకూటికి వ్యభిచారం చేసే వారిని చట్టపరిధిలో శిక్షించడం ఎంతవరకు కరెక్ట్.?
Courtesy: https://www.facebook.com/anita.yelishetty