వాట్సప్ పనిచేయాలంటే ఇప్పుడు కొత్త ఫోన్లు కొనాల్సిందే. పాత ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పాత వెర్షన్ తో నడిచే ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. సరికొత్త ఫీచర్స్ ను వాట్సప్ ప్రవేశపెట్టింది. వీటి వల్ల మెసేజింగ్ మరింత సురక్షితం కాబోతోంది. అది ఆపరేటింగ్ సిప్టం పై పనిచేస్తుంది. దీని వల్ల పాత ఫోన్లలో వాట్సప్ ను వాడుకోవడం కుదరదు.
- ఆండ్రాయిడ్ 2.1,2.2 వెర్షన్స్ పై పనిచేసే స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఫోన్ 3జీఎస్ లేదా ఐఓఎస్ 6 పై వాట్సాప్ పనిచేయదు
- బ్లాక్ బెర్రి ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రి 10, నోటియా ఎస్ 40, నోకియా సింబియాన్ ఎస్ 60 ఆపరేటింగ్ సిప్టం లపై 2017 జూన్ 30 వరకు మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది.
- వాట్సాప్ మేసేజ్ లను మరింత సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల పైన సూచించిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
- వాట్సాప్ చాటింగ్ లో పంపే సమాచారం ఎన్ క్రిప్ట్ చేస్తున్నందు వల్ల కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.