వాట్సప్ లోనూ మెసేజ్ డిలీట్ ఆప్షన్

వాట్సప్ లో ఒకసారి పోస్ట్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదన్న సంగతి దాన్ని ఉపయోగించే వారందరికీ తెలిసిందే. కొన్ని సార్లు ఒకిరికి పంపాల్సిన పోస్టులను మరొకరికి పంపడం లాంటివి చేస్తూ ఇబ్బందులు పడుతున్న సంగతి మామూలే. ఈ క్రమంలో వాట్సప్ లో ఒసారి పోస్ట్ చేసిన తరువాత సదరు పోస్టును డిలీట్ చేసే అవకాశం కలగనుంది. వాట్సప్ వినియోగ దారుల నుండి వస్తున్న డిమాండ్ మేరకు ఈ తరహా అవకాశాన్ని కల్పించడానికి వాట్సప్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికీ వాట్స్ పు పోటీగా ఉన్న టెలీగ్రామ్, వెబర్ లలో రీకాల్ లేదా రివోక్ అవకాశం ఉండడంతో ఇదే తరహా అవకాశాన్ని వాట్స ప్ లోనూ త్వరలో కల్పించడాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఆఫ్షన్ ను ప్రయోగాత్మకంగా కొంత మందికి కల్పించి పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని వాట్స్ ప్ వర్గాలు చెప్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *