పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం

పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో హింసత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీంగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరస్పర దాడులు, గృహదహనాల ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సీపీఎం మద్దతుదారులదిగా చెప్తున్న ఓ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో అందులో నిద్రిస్తున్న దంపతులు కన్నుమూశారు. ఈ ఘటన సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలో జరిగింది. తృణముల్ కాంగ్రెస్ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని సీపీఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే సీపీఎం, బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలే ఘర్షణలకు పాల్పడుతున్నారని తృణములు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలైన నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరు అల్లర్లుకు పాల్పడినా ఉపేక్షించవద్దని చెప్పింది.
పోలింగ్ కేంద్రాల్లోకి బలవంతంగా ప్రవేశించడం, బ్యాలెట్ ప్రత్రాలపై అక్రమంగా స్టాంపులు వేయడం, ఓటర్లను బెదిరించడం, ప్రత్యర్థి పార్టీలకు చెందినవారిని పోలింగ్ బూత్ ల వద్దకు రాకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు చేసుకున్నాయి. కూచ్‌ బెహర్‌ జిల్లాలోని శుట్కబరి ప్రాంతంలో బాంబుపేలిన ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి అయితే బాంబు తక్కువ తీవ్రత గలదిగా పోలీసులు వెల్లడించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద బాహాబాహీకి దిగుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ముందు జరుగుతున్న బెంగాలు పంచాయతీ ఎన్నికలను అధికార తృణముల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో తమ హవా ఏమాత్రం తగ్గలేదని నిరుపించుకునే ప్రయత్నంలో ఉన్న దీదీపార్టీ దానికి అనుగుణంగానే రాష్ట్రంలోని 34 శాతం సీట్లను తృణముల్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. తమ అభ్యర్థులను బెదిరించడం వల్లే వారు కనీసం నామినేష్ పత్రాలు కూడా దాఖలు చేయలేకపోయారని సీపీఎం, బీజేపీలు ఆరోపించాయి. సీపీఎం తో పాటుగా రాష్ట్రంతో సత్తా చాటేందుకు బీజేపీ కూడా విశ్వప్రయత్నం చేస్తుండడంతో అధికార తృణముల్ కాంగ్రెస్ ఈ ఎన్నికల కోసం సర్వశక్తులను ఒడ్డుతోంది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని బెంగాల్ లో అన్ని రాజకీయ పక్షాల విశ్వాసం. గతంలోనూ సీపీఎంకు ఎదురులేని రోజుల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో తొలుత సత్తా చాటిన తృణముల్ కాంగ్రెస్ ఆ తరువాత బెంగాల్ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు సీపీఎం, బీజేపీలు శాయశక్తులా ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ నామమాత్రంగా కొన్ని ప్రాంతాల్లోనే బలమైన పోటీ ఇస్తోంది.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని ముందుగానే పసిగట్టిన ఎన్నికల సంఘం దానికి తగినట్టుగా భారీ పోలీసుల బందోస్తును ఏర్పాటు చేసింది. దాదాపు 1.5 లక్షల మంది పోలీసులను మోహరించింది. వీరితో పాటుగా ప్రత్యేక బలగాలు కూడా రంగంలో దిగినప్పటికీ హింసాత్మక ఘటనలు మాత్రం చోటుచేసుకున్నాయి.

ఆందోళనకు దిగిన హోంగార్డులు-రోడ్డు పై భైఠాయింపు


ఉత్తర కొరియా వైఖరిలో ఎందుకీ మార్పు…?
West_Bengal