అకాల వర్షాలు కురుస్తాయి-వాతావరణ శాఖ హెచ్చరిక

0
73
అకాల వర్షాలు
heavy rain and wind

దేశవ్యాప్తంగా అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరో రెండురోజల పాటు ఈ పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. ఇప్పటివరకు అకాల వర్షాలు, ఈదురు గాలలు వీచడం, పిడుగులు పడడం వంటి వాటివల్ల దేశవ్యాప్తంగా 125 మంది వరకు మరణించగా 200 మందికి పైగా గాయాలు అయ్యాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశంలోని అనేక రాష్ట్రాలు అకాల వర్షాల వల్ల అతలాకుతలం అయ్యాయి. ఉత్తరాదిని ముంచెత్తిన దుమ్ము తుపాను ధాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులన్నారు. మరో రెండు రోజులు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర,
ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాలు, ఒరిస్సా, బీహార్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, జమ్మూకాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, చండీగడ్, బీహార్, జార్ఖండ్, తూర్పు రాజనస్థాన్, విదర్భ, చత్తీస్ గడ్ లలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు నాగాల్యాండ్, మణిపూర్ లతో పాటుగా దక్షిణ కర్ణాటలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఆ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం దేశవ్యాప్తంగా అకాల వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాదిని ఇసుకు తుపాన్లు ముంచెత్తితో తీర్పు తీరంలో పెనుగాలు పిడుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దక్షిణాదిన వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉండగా మధ్యభారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. దాదాపుగా దేశం మొత్తం మీద వాతావరణ పరిస్థితులు సమక్రమంగా లేవు.
పెనుగాలలకు దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఉత్తరాదిన దుమ్ము తుపాను కారణంగా ఆస్తినష్టం భారిగా సంభంవించింది. పెద్ద సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా రాజస్థాన్ లో దుమ్ము తుపాను పెను విధ్వంసాన్నే మిగిల్చింది. ఇటు ఉత్తర్ ప్రదేశ్ లో పెనుగాలులు తీవ్ర భీబత్సన్ని సృష్టించారు. ఈ గాలల ధాటికి ఎక్కువ ప్రాణనష్టం ఉత్తర్ ప్రదేశ్ లోనే జరిగింది.
ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల విభాగాలతో పాటుగా కేంద్ర విపత్తుల నివారణ సంస్థ కూడా రంగంలోకి దిగింది. కూలిపోయిన విద్యుత్ స్థంబాలను పునరుద్దరించే పనిలో పడిన బృందాలు రెడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాకం కలక్కుండా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మెరగుపడని వాతావరణ పరిస్థితులు సహాయక కార్యక్రమాలకు అడ్డంకిగా మారాయి.
మరో రెండు నుండి మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది.
Meteorological Department , Meteorological , weather, weather conditions in india, weather in india, rough weather in india, indian weather, weather conditions, heavy rains, storm, dust storm, dust storm in india ,

ఉత్తరాదిన దుమ్ము తుపాను 100 మంది మృతి


ust-storm1/
weather bulletin

Wanna Share it with loved ones?