యుద్ధమేఘాలు….

0
80

అమెరికా-ఉత్తర కొరియా ల మధ్య యుద్ధ మేఘాలు కమ్మకుంటున్నాయి. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రచ్చన యుద్ధం ముగిసిన తరువాతి కాలంలో ఎన్నడూ లేని విధంగా అణు యుద్ధ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. యుద్ధం అంటూ వస్తే అమెరికా అణు బాంబులు వేస్తామంటూ ఇప్పటికే ఉత్తర కొరియా అనేక సార్లు ప్రకటించింది. అటు అమెరికా కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఉత్తర కొరియా యుద్ధానికి దిగితే ఆదేశాన్ని సర్వనాశనం చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తోంది.
ప్రపంచంలో సైనిక పరంగా బలమైన దేశం ఏది అంటే నిస్సందేహంగా అమెరికానే … రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అపార సైనిక సంపత్తిని సాధించుకున్న అమెరికా వద్ద భూమిని కొన్ని వందల సార్ల ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న బాంబులున్నాయి. మొదటి అణు బాంబును రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రయోగించిన అమెరికా ఆ తరువాత దానికన్నా కొన్ని వందల, వేల రెట్ల శక్తి ఉన్న అణు బాంబులను తయారు చేసి పెట్టుకుంది. అగ్రరాజ్యం వద్ద వార్ హెడ్స్ గా పిల్చుకునే అణు బాంబులు 6800 ఉన్నట్టు అంచానా…
అణుబాంబులు మోసుకుని పోయే సామర్థ్యం ఉన్న మిస్సైళ్లకు అమెరికా వద్ద కొదవలేదు. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఖండాతర క్షిపణులు అమెరికా అమ్ములపొదిలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రచ్చన యుద్ధం తరువాత కూడా అమెరికా తన రక్షణ వ్యయాన్ని ఏనాడు తగ్గించలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెంచుకుంటూ పోతున్న అమెరికా సైనికపరంగా ఇతర దేశాలకు అందనంత ఎత్తులో నిల్చింది.
అణు దాడి చేస్తాం అంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా వద్ద ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయనే విషయంపై ప్రపంచానికి సరైన సమాచారం లేదు. అయితే 16-60 అణు బాంబులు ఉత్తర కొరియా వద్ద ఉన్నాట్టు సమాచారం. వీటితో అమెరికాలోని అనేక ప్రాంతాలపై దాడి చేయగలం అన్నది ఉత్తర కొరియా ధీమా. కొరియా నుండి అణు మిస్సైళ్లు అమెరికాను చేరే లోపలే వాటిని మార్గమధ్యంలోనే ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని అమెరికా సమకూర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఓక వేళ ఉత్తర కొరియా అణు దాడికి దిగితే దానికి ప్రతిగా అమెరికా కూడా ఆ దేశంపై అణ్వాయుధాలు ప్రయోగిస్తుంది. అమెరికా అధ్యక్షుడి నుండి ఆదేశాలు అందిన 15 నిమిషాల్లో ఉత్తర కొరియా అణు దాడి చేసే సత్తా అమెరికాకు ఉంది.
చైనా సహాయంతోనే ఉత్తర కొరియా అణు బాంబులను తయారు చేసిందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపధ్యంలో కొరియా అణు బాంబులను తక్కువ అంచానా వేయవద్దని నిపుణలు అంటున్నారు.
https://youtu.be/9-q2ZTRb-Yo

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here