దుర్గగుడిలో క్షుద్రపూజలపై మండిపడ్డ స్వరూపానంద స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారంటూ జరుగుతున్న ప్రచారం పై విశాఖపట్నం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్గగుడి వ్యవహారంలో పూర్తి విచారణ జరిపి తాంత్రిక పూజలకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగడం సరికాదని దీనివల్ల దేశానికే అరిష్టమన్నారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక, క్షుద్ర పూజలు జరగడం దారుణమన్నారు. దేవాలయాల ఆస్తులు, ఆదాయం పై ఉన్న ఆశక్తి పాలకులకు వాటి నిర్వహణపై లేదని ధ్వజమెత్తారు.
దేవాలయాల ఆదాయం పక్కదారి పడుతోందని ఆయన విరుచుకుని పడ్డారు. రాష్ట్రంలోని పీఠాధిపతులతో సమావేశం నిర్వహించి దేవాలయాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలకు ఖరారు చేయాలన్నారు. దీనికోసం గాను పీఠం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖరాయనున్నట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *