విరాట్ సొగసైన సెంచరీ…

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అధ్బుతమైన ఆటతీరుతో అలరిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో విరాట్ చేసిన సెంచరీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సొగసైన షాట్లతో క్రికెట్ అభిమానులకు చక్కటి విందును అందించిన విరాట్ 130 బంతుల్లోనే సెంచరీని పూర్త చేశాడు. సూపర్ ఫాంలో ఉన్న విరాట్ చక్కటి టైమింగ్ తో ఆలరిస్తున్నాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో 10 సెంచరీని పూర్తి చేసిన విరాట్ ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటిగ్ పేరుమీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం మీద విరాట్ టెస్టుల్లో 19సెంచరీలు చేయగా అన్ని ఫార్మాట్ లలో కలిసి 51 సెంచరీలు చేశాడు.