ఆగస్టు 5న విజయం ఎక్స్ పో | vijayam Expo on august 5th
vijayam Expo… జౌత్సాహిక బ్రాహ్మణ వ్యాపారుల కోసం ఆగస్టు 5వ తేదీన ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్టు నిర్వహాకులు మల్లాది చంద్రమౌళి తెలిపారు. విజయం ఎక్స్ పో పేరుతో మల్కాజ్ గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని గజానన ఫంక్షన్ హాల్ లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. బ్రాహ్మణ వ్యాపారులు ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేస్తారని, అనేక వస్తువులను అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్టాల్స్ ను ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా కేటాయిస్తున్నట్టు చంద్రమౌళి తెలిపారు.
బ్రాహ్మణ వ్యాపారులను ప్రేత్సహించే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని, ఇటువంటి ప్రదర్శన వల్ల బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యాపారులకు లాభం కలగడంతో పాటుగా అన్ని రకాల వ్యాపారులు ఒక చోట కలవడం ద్వారా పరస్పరం వ్యాపారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఎక్కువ మంది పేద, మధ్యతరగతికి చెందినవారు స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారని, ఇళ్లలో తయారైన నాణ్యమైన ఉత్పత్తులను ఇక్కడ అమ్మకానికి ఉంచుతున్నామని అన్నారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారి నుండి ఎటువంటి రుసులు వసూలు చేయడం లేదన్నారు.
తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఎగ్జిభిషన్లను ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేస్తున్నామని మల్లది చంద్రమౌళి తెలిపారు. ఇందులో పాల్గొనే వారు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసర లేదన్నారు. స్థానిక ప్రజలు ఈ ప్రదర్శనకు రావాలని ఆయన కోరారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో ఉచిత వైద్య పరీక్షలను ఉదయం 8.00 నుండి 11.30 వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకోసం 9133290543,9666709111 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.