గుజరాత్ లో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ లు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ వైపే మొగ్గుచూపడంతో ఆయననే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎం పదవిపై పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రిని మార్చడానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ససేమీరా అనడంతో రూపానీనే తిరిగి ముఖ్యమంత్రి పదవి వరించింది.
రూపానీతో పాటుగా మరో 20 మంది మంత్రులు పదవీప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.