ప్రధాని హత్యకు కుట్ర పన్నారంటూ వరవరరావు సహా పలువురి అరెస్ట్

0
54
varavara rao arrest

varavara rao విరసం నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వరవరరావును అరెస్టు చేసిన పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారితో పాటుగా కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వరవరరావు పేరు కూడా ఉండడంతో ఆయన్ని విచారించిన పోలీసులు అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.
మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న పోలీసులు ఏకకాలంలో వరవరరావు నివాసంతో పాటుగా ఆయన కుమారై నివాసంలోనూ సోదాలు జరిపారు. హైదరాబాద్ తో పాటుగా ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర పోలీసులు దాడులు జరిపి పలువురిని అరెస్టు చేశారు.మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, దిల్లీ, జార్ఖండ్‌ లలో పోలీసులు దాడులు జరిపారు. అరెస్టయినవారిలో గౌతమ్‌ నవలఖ, సుధా భరద్వాజ్‌, ఆమె కుమార్తె అను భరద్వాజ్‌ లు కూడా ఉన్నారు. గౌతమ్ నవలఖను ఢిల్లీలో అరెస్టు చేశారు. స్వతహాగా జర్నలిస్టు అయిన ఆయన సామాజిక, మానవహక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు. ఆయన నివాసం నుండి ల్యాప్ టాప్ తో పాటుగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
మానవహక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్ ను ఫరీదాబాద్ లో అరెస్టు చేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఆమె నివాసంలోనూ దాడులు జరిపి భరద్వాజ్ కుమారై అను భరద్వాజ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో వ్యాయవాది అరుణ్‌ ఫెరీరాను అదుపులోకి తీసుకున్నారు.మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు వాదిస్తున్నందులవల్లనే తనను అరెస్టు చేసినట్టు ఆయన ఆరోపించారు. ముంబయిలో వెర్నన్‌ గోన్‌సాల్వెస్‌, ఝార్ఖండ్‌లో స్టాన్‌ స్వామిలను కూడా పుణెకు తరలించారు. పౌరహక్కుల నేత ఆనంద్‌ తెల్‌తుంబ్డే నివాసంలో సోదాలు జరిపారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు.
మహారాష్ట్ర పోలీసులు ఐదు రాష్ట్రాలకు చెందిన మావో సానుభూతిపరులు, మానవహక్కుల కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?


వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి

Wanna Share it with loved ones?