త్వరలో టీడీపీలో చేరనున్న వాణీ విశ్వనాథ్

త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సినీనటి వాణీ విశ్వనాథ్ తెలిపారు. అనంతపురంకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న తీరును చేసే ఆ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. తాను ఎప్పుడు పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తానని వాణీ విశ్వనాథ్ తెలిపారు. రాజకీయాలంటే తనకు ఎప్పటి నుండో ఆశక్తి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని అందువల్లే ఇక్కడికి వచ్చినట్టు ఆమె తెలిపారు. పార్టీలో తన పాత్ర ఏవిధంగా ఉండబోతోంది, ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్న విషయాలు తనకు ఏమీ తెలియవని చంద్రబాబు నాయుడు ఎట్లా చెబితే అట్లా చేస్తానని ఆమె పేర్కొన్నారు.